ETV Bharat / sports

ఐసీసీ నూతన ఛైర్మన్​గా గ్రెగ్​ బార్క్​లే ఎన్నిక

author img

By

Published : Nov 25, 2020, 10:13 AM IST

Updated : Nov 25, 2020, 10:58 AM IST

ఐసీసీ కొత్త ఛైర్మన్​గా న్యూజిలాండ్​కు చెందిన గ్రెగ్​ బార్క్​లే ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ పదవిని దక్కించుకున్నారు.

New Zealand's Greg Barclay elected ICC chairman, replaces Manohar
ఐసీసీ నూతన ఛైర్మన్​గా గ్రెగ్​ బార్క్​లే ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) కొత్త ఛైర్మన్​గా న్యూజిలాండ్​కు చెందిన గ్రెగ్​ బార్క్​లే ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి.. ఐసీసీకి రెండో స్వతంత్ర్య ఛైర్మన్​గా నిలిచారు.

రేసులో ఇద్దరే..

ఐసీసీ ఛైర్మన్​ పదవిలో భారత్​కు చెందిన శశాంక్​ మనోహర్.. తన రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక ఛైర్మన్​గా ఖవాజాను నియమించింది ఐసీసీ డైరెక్టర్ల బోర్డు. ఛైర్మన్​ ఎన్నికలో భాగంగా కివీస్​ క్రికెట్​ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బార్క్​లే నామినేషన్​ దాఖలు చేయడం.. ఆయనతో పాటు తాత్కాలిక అధ్యక్షుడు ఖవాజా కూడా నామినేషన్​ వేయడం వల్ల వీరిద్దరే ఛైర్మన్ పదవికి పోటీపడ్డారు.

సఫారీల మద్దతుతో

ఈ​ ఎన్నికలోని తొలి రౌండ్​లో బార్క్​లేకు 10 ఓట్లు, ఖవాజాకు ​6 ఓట్లు మాత్రమే లభించాయి. రెండో రౌండ్​లో దక్షిణాఫ్రికా బోర్డు.. బార్క్​లేకు మద్దతు తెలపడం వల్ల ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన బార్క్​లే ఛైర్మన్​గా ఎన్నికయ్యారు.

ప్రపంచకప్​ డైరెక్టర్​గా అనుభవం

2015 పురుషుల ప్రపంచకప్​ డైరెక్టర్​గా బార్క్​లే వ్యవహరించారు. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాకు చెందిన అనేక కంపెనీల్లో డైరెక్టర్​ హోదాలో బార్క్​లే పనిచేశారు. ఆక్లాండ్​లో న్యాయవాది వృతిని ఎంచుకుని.. ఆ తర్వాత 2012లో కివీస్​ క్రికెట్​ డైరెక్టర్​గా ఐసీసీలో ఎంపికయ్యారు.

Last Updated : Nov 25, 2020, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.