పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించింది న్యూజిలాండ్. 9 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మహ్మద్ హఫీజ్(99 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.
హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మహ్మద్ హఫీజ్(57 బంతుల్లో 99 నాటౌట్) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిగిలిన వారిలో రిజ్వాన్(22) మినహా అందరూ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, నీషమ్, సోధీ తలో వికెట్ తీశారు.
అనంతరం కివీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సీఫర్ట్(84*), విలియమ్సన్(57*) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఫహీమ్ అష్రఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.
నాలుగో క్రికెటర్‌గా హఫీజ్
40 ఏళ్ల పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్.. ఈ మ్యాచ్‌లో చివరి 3 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తద్వారా 99 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 99* చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు అలెక్స్ హేల్స్, ల్యూక్ రైట్, డేవిడ్ మలన్ ఉన్నారు.