భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే భారత టాప్ఆర్డర్ను కుప్పకూల్చారు కివీస్ బౌలర్లు. మయాంక్ ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు.
-
FIFTY!
— BCCI (@BCCI) February 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
A well made half-century for #TeamIndia opener @mayankcricket on Day 3 of the 1st Test.
This is his 4th in Test cricket 👏👏
Live - https://t.co/tW3NpQIHJT #NZvIND pic.twitter.com/7bPL9bbWyJ
">FIFTY!
— BCCI (@BCCI) February 23, 2020
A well made half-century for #TeamIndia opener @mayankcricket on Day 3 of the 1st Test.
This is his 4th in Test cricket 👏👏
Live - https://t.co/tW3NpQIHJT #NZvIND pic.twitter.com/7bPL9bbWyJFIFTY!
— BCCI (@BCCI) February 23, 2020
A well made half-century for #TeamIndia opener @mayankcricket on Day 3 of the 1st Test.
This is his 4th in Test cricket 👏👏
Live - https://t.co/tW3NpQIHJT #NZvIND pic.twitter.com/7bPL9bbWyJ
టాపార్డర్ విఫలం
ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా మరోసారి విఫలమయ్యాడు. 30 బంతుల్లో 14 రన్స్ చేసిన ఇతడు.. కుదురుకున్నాక ఔటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 58(99 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్లో అర్ధశతకంతో రాణించాడు. అయితే సౌథీ బౌలింగ్‌లో కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే పుజారా (11) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 19 (43 బంతుల్లో 3ఫోర్లు) రన్స్ చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటై మళ్లీ నిరాశపర్చాడు. ఫలితంగా భారత్ 113 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో అజింక్య రహానె 14(19 బంతుల్లో 2 ఫోర్లు), హనుమ విహారి(2; 10 బంతుల్లో) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 48 పరుగుల వెనుకంజలో ఉంది కోహ్లీసేన.
-
Drinks and a paint touch up for the crease lines at the @BasinReserve. India 115/4 and 68 runs behind. Kohli the last man to go falling to Boult for 19 caught by Watling. LIVE scoring | https://t.co/vWdNIMMIwd #NZvIND pic.twitter.com/8QQGJiKkxP
— BLACKCAPS (@BLACKCAPS) February 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Drinks and a paint touch up for the crease lines at the @BasinReserve. India 115/4 and 68 runs behind. Kohli the last man to go falling to Boult for 19 caught by Watling. LIVE scoring | https://t.co/vWdNIMMIwd #NZvIND pic.twitter.com/8QQGJiKkxP
— BLACKCAPS (@BLACKCAPS) February 23, 2020Drinks and a paint touch up for the crease lines at the @BasinReserve. India 115/4 and 68 runs behind. Kohli the last man to go falling to Boult for 19 caught by Watling. LIVE scoring | https://t.co/vWdNIMMIwd #NZvIND pic.twitter.com/8QQGJiKkxP
— BLACKCAPS (@BLACKCAPS) February 23, 2020
ఆల్‌రౌండర్ జేమిసన్ రాణింపు..
రెండో రోజు ఆటముగిసే సమయానికి 216/5 ఉన్న కివీస్.. 348 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్.. కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. ఫలితంగా కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్ల తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో టిమ్‌సౌథీ(6) షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
తర్వాత ఆల్‌రౌండర్లు కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 43(74 బంతుల్లో 5ఫోర్లు), కైల్ జేమిసన్ 44(45 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అశ్విన్ తొలుత 296 పరుగుల వద్ద జేమిసన్‌ను ఔట్ చేశాడు. కాసేపటికే గ్రాండ్‌హోమ్ కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే పంత్‌కు చిక్కాడు.
ఆఖర్లో అజాజ్ పటేల్(4)తో కలిసి ట్రెంట్‌బౌల్ట్ 38 (24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడాడు. చివరికి ఇషాంత్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు బౌల్ట్. ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌కు 348 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఇషాంత్(5), అశ్విన్(3), షమీ(1), బుమ్రా (1) వికెట్లు పడగొట్టారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది.