ETV Bharat / bharat

బైక్ చైన్​​లో చున్నీ చిక్కుకుని తెగిపోయిన చేయి - ఏం జరుగుతుందో తెలిసేలోపే జీవితం తారుమారు - WOMAN HAND CUT OFF IN BIKE TIRE

బైక్​పై వెళ్తుండగా చైన్​లో చిక్కుకున్న చున్నీ- దుపట్టా చుట్టుకుని పూర్తిగా తెగిపోయిన మహిళ చేయి

Woman Hand Cut Off In Bike Chain
Woman Hand Cut Off In Bike Chain (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 10:17 AM IST

Woman Hand Cut Off In Bike Chain : బైక్​పై వెళ్తుండగా ఓ మహిళ చున్నీ చైన్​లో చిక్కుకోవడం వల్ల ఆమె చేయి పూర్తిగా తెగిపోయింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీ జిల్లాలో జరిగింది. కట్​ అయిన చేయి బైక్ చైన్​కు వేళాడింది. తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జైరామ్​ అహిర్వార్​ అనే వ్యక్తి రాజ్​గఢ్​లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆమె కుమార్తె రక్ష ఇటీవల భాయ్​దూజ్​ సందర్భంగా ఇంటికి వచ్చింది. ఆమెకు ఆరు నెలల కుమార్తె ఉంది. ఆ చిన్నారికి అనారోగ్యంగా ఉండటం వల్ల బైక్​పై ఆస్పత్రికి తీసుకెళ్లింది. బైక్​పై వెళ్తున్న క్రమంలో రక్ష చున్నీ చైన్​లో చిక్కుకుంది. అనంతరం చున్నీ చేయికి చుట్టుకుంది. దీంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆమె ఎడమ చేయి పూర్తిగా తెగిపోయి చైన్​లోనే ఉండిపోయింది. తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెను వెంటనే హన్సారీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మిషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారి- బైక్​పై వెళ్లేటప్పుడు మహిళలు చున్నీ లేదా చీర కొంగును చేతిలో పట్టుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.