ETV Bharat / entertainment

NBK 109 టైటిల్ రివీల్ - 'డాకు మహారాజ్'గా బాలయ్య! - BALAKRISHNA NBK 109

NBK 109 టైటిల్ రివీల్ - బాలయ్య కొత్త సినిమా పేరు ఏంటంటే ?

NBK 109 Teaser Update
NBK 109 Teaser Update (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 10:28 AM IST

NBK 109 Teaser Update : నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ ​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK 109'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ ఈవెంట్​లో ఈ సినిమా టైటిల్​తో పాటు టీజర్​ను విడుదల చేశారు. 'డాకు మహారాజ్' అనే పేరును ఫిక్స్ చేశారు.

"ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది" అంటూ ఓ పవర్​ఫుల్ డైలాగ్​తో టీజర్ ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్​గా సాగింది. "గుర్తుపట్టావా నన్ను. నేనే డాకు మహారాజ్‌" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్‌, విజువల్స్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ ఆఖరిలో బాలయ్య న్యూ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'NBK 109'తో పాటు 'BB4' (బాలకృష్ణ బోయపాటి 4) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నాలుగోసారి కలిసి పనిచేయనున్నారు బాలయ్య. 14 రీల్స్‌ ఎంటర్​టైన్​మెంట్‌ బ్యానర్​పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె తేజస్విని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాబీ దేఓల్​తో పాటు రవి కిషన్ తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందినీ చౌదరీ, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. స్టార్​ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 గ్రాండ్​గా విడుదల కానుంది.

సంక్రాంతి రేసులో 4 సినిమాలు! - అయినా ఈ సీజన్‌ వారిద్దరిదే!

బాలయ్య, మహేశ్ మల్టీస్టారర్- క్లూ ఇచ్చిన తమన్- స్టోరీ కూడా కంప్లీట్! - Balayya Mahesh Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.