ETV Bharat / sports

వర్షం అడ్డంకి: మొదటి రోజు ముగిసిన ఆట.. భారత్ 122/5 - భారత్ న్యూజిలాండ్ మొదటి టెస్టు

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ 55 ఓవర్లే సాగింది.

మ్యాచ్
మ్యాచ్
author img

By

Published : Feb 21, 2020, 10:46 AM IST

Updated : Mar 2, 2020, 1:17 AM IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా 55 ఓవర్ల పాటే సాగిన ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్ బౌలర్లు ఆధిపత్యం వహించారు. ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ పృథ్వీషా(16), నయా వాల్‌ పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి(7) పూర్తిగా విఫలయమ్యారు. మయాంక్ అగర్వాల్ 34 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

అనంతరం టీ విరామ సమయానికి వర్షం అడ్డంకిగా మారింది. ఫలితంగా మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం అలాగే కొనసాగిన కారణంగా మొదటి రోజు ఆటను నిలిపివేశారు అంపైర్లు. అప్పటికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (10), అజింక్య రహానే (38) ఉన్నారు. వీరిద్దరూ న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు.

Last Updated : Mar 2, 2020, 1:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.