భారత్-న్యూజిలాండ్ మధ్య మరో కీలక సమరం ప్రారంభమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో ఇవాళ తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వన్డేల్లో అరంగ్రేటం చేశారు. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న కోహ్లీసేన.. ఈ సిరీస్‌నూ నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌నైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ భావిస్తోంది.
జట్టు వివరాలు:
భారత్:
పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్:
మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, టామ్ లేథమ్ (కెప్టెన్, కీపర్), గ్రాండ్‌హోమ్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, హమిష్ బెనెట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ