ETV Bharat / sports

డీఎల్​ఎస్​లో పొరపాటు.. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ తికమక!

మంగళవారం జరిగిన క్రికెట్​ మ్యాచ్​లో అంపైర్లు, బ్యాట్స్​మెన్​ను తికమకపెట్టారు. డక్​వర్త్ లూయిస్ విధానంలో లక్ష్యాన్ని సవరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

New Zealand Vs Bangladesh
డీఎల్​ఎస్​లో పొరపాటు.. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ తికమక
author img

By

Published : Mar 31, 2021, 8:30 AM IST

న్యూజిలాండ్​తో​ రెండో టీ20లో బంగ్లాదేశ్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లా జట్టుకు విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయి. అంపైర్ల పొరపాటు వల్ల లక్ష్యం విషయంలో ఆ జట్టు ఆటగాళ్లు తికమకపడ్డారు.

ఇంతకీ ఏం జరిగింది?

బంగ్లా ఛేదన సందర్భంగా విచిత్ర పరిస్థితుల వల్ల అసాధారణ రీతిలో ఆట కాసేపు ఆగిపోయింది. డీఎల్ఎస్ షీట్స్ లేకపోవడం వల్ల అసలు లక్ష్యం ఎంత అన్న దానిపై స్పష్టత లేకపోవడమే అందుకు కారణం. వర్షం వల్ల బంగ్లా లక్ష్యాన్ని డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో సవరించాల్సి వచ్చింది. మైదానంలో భారీ తెర, కివీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, ఐసీసీ వెబ్​సైట్ బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 148 పరుగులని చెప్పాయి. తర్వాత దాన్ని 170గా, ఆ తర్వాత 171 (ఇది సరైంది)గా సవరించారు.

New Zealand Vs Bangladesh
బంగ్లాదేశ్ బ్యాట్స్​మెన్

అయితే ఛేదన ఆరంభంలో బంగ్లాదేశ్​కు తప్పుగా లక్ష్యం ఇచ్చారా లేదా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. రెండు జట్లకు డీఎల్ఎస్ షీట్లు ఇవ్వలేదన్నది మాత్రం స్పష్టం. ఛేదనలో జట్టు ఏ ఓవరకు ఏ స్కోరుతో ఉంటే గెలుస్తుందో డీఎల్ఎస్ షీట్లలో ఉంటుంది. ముఖ్యంగా పదే పదే వర్షం అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ పత్రాలు చాలా ముఖ్యం. బంగ్లా ఛేదన ఆరంభంలో భారీ తెరపై లక్ష్యం 148 పరుగులని చూపెట్టారు. లక్ష్యంపై స్పష్టత లేకపోవడం వల్ల బంగ్లా 1.3 ఓవర్లు ఆడిన తర్వాత మ్యాచ్​ను నిలిపివేశారు. అధికారులు ఐదు నిమిషాల పాటు అంకెలతో కుస్తీ పట్టాక బంగ్లా 16 ఓవర్లలో 170 చేయాల్సివుంటుందని తేల్చడం వల్ల ఆట తిరిగి ఆరంభమైంది. ఆ తర్వాత లక్ష్యాన్ని మరోసారి సవరించారు. లక్ష్యాన్ని 18వ ఓవర్ తర్వాత 171గా మార్చారు. కలిగిన ఇబ్బందికి రెండు జట్లకు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.