న్యూజిలాండ్ జట్టు ఒకేసారి జాక్‌పాట్ కొట్టింది. పాకిస్థాన్‌పై తొలి టెస్టు గెలిచిన తర్వాత.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఈ ఘనత సాధించడం వారికిదే తొలిసారి. దీనితో పాటు టెస్టు ఛాంపియన్పిష్ పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది.
మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 101 పరుగుల తేడాతో పాక్‌పై కివీస్ అద్భుత విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(129) అదరగొట్టిన కెప్టెన్ విలియమ్సన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ గెలిస్తే.. ర్యాంకింగ్స్ పట్టికలో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకుంటుంది.
11 ఏళ్ల తర్వాత సెంచరీ
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్ 102 పరుగులు చేసి మెప్పించాడు. కానీ తమ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. అయితే టెస్టుల్లో 11 ఏళ్ల క్రితం శ్రీలంకపై తొలి శతకం చేసిన ఫవాద్.. మళ్లీ ఇప్పుడు ఆ మార్క్‌ను అందుకోవడం విశేషం.