తొలి టీ20లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పొలార్డ్(37 బంతుల్లో 75 పరుగులు నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.
వర్షం పడటం వల్ల మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. పొలార్డ్(75*) మినహా ఫ్లెచర్(34 పరుగులు), అలెన్(30)మాత్రమే ఆకట్టుకున్నారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 5, సౌతీ 2 వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో కివీస్ ఆచితూచి ఆడింది. సైఫర్ట్(17), కాన్వే(41), ఫిలిప్స్(22), నీషమ్(48*), శాంట్నర్(31*) ఆడటం వల్ల 15.2 ఓవర్లలో 179 పరుగులు చేసి విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో థామస్ 2, కాట్రెల్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.