కొత్త ఆటగాళ్లతో తమ జట్టుకు అనుభవం వస్తుందని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇటీవలే జరిగిన మినీ వేలంలో తమ జట్టులో స్టీవ్ స్మిత్, టామ్ కరన్‌తో పాటు కొందరు స్వదేశీ ఆటగాళ్లు చేరడంపై ఈ విధంగా స్పందించాడు.
"దిల్లీ జట్టులో కొత్తగా చేరిన సీనియర్ ఆటగాళ్ల అనుభవం జట్టు సభ్యులకు చాలా ఉపయోగపడుతుంది. స్టీవ్ స్మిత్, టామ్ కరన్ వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు కొందరు స్వదేశీ ఆటగాళ్లు జట్టులో చేరారు. దేశవాళీ క్రికెట్లో లుక్మాన్ మెరివాలా అద్భుతంగా రాణించాడు. ఇతను జట్టులో చేరడం ఇతర యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకం."
-శ్రేయస్ అయ్యర్, దిల్లీ జట్టు కెప్టెన్
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మరింత ఉత్కంఠ భరితంగా ఉంటుందని శ్రేయస్ అన్నాడు. 14వ సీజన్లో అన్ని టీమ్‌లు దృఢంగా కనిపిస్తున్నాయని... ప్రతీ మ్యాచ్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. గత రెండు సీజన్ల నుంచి తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, అదే మళ్లీ కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అభిమానులు తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తారని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:'కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచి చూస్తున్నా'