కరోనా నేపథ్యంలో బంతిపై లాలాజలం, చెమట వాడడంపై ఐసీసీ నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బంతికి మెరుపు తెప్పించేందుకు కొత్త పద్ధతులకు అలవాటు పడాల్సిందేనని భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌శర్మ అన్నాడు.
"లాలాజలం, చెమట వాడకపోతే మనం కోరుకున్నట్లుగా బంతి మెరుపు రాదు. కానీ కరోనా కారణంగా వీటిని వాడడంపై నిషేధం ఉంటే కొత్త పద్ధతులకు క్రికెటర్లు అలవాటు పడాల్సిందే" అని ఇషాంత్ చెప్పాడు.
పాంటింగ్ స్ఫూర్తి
ఐపీఎల్‌లో దిల్లీ కోచ్ పాంటింగ్ మాటలు స్ఫూర్తినిచ్చినట్లు ఇషాంత్ తెలిపాడు. "గతేడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసినపుడు కొత్త ఆటగాడిలా భావించా. అప్పుడు పాంటింగ్ ప్రోత్సాహం అందించడం వల్ల మళ్లీ ఆత్మవిశ్వాసం వచ్చింది" అని ఇషాంత్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి.. అక్టోబర్‌లో ఐపీఎల్: లీగ్ నిర్వహణకు సన్నాహాలు!