ETV Bharat / sports

ఐసీసీ ఛైర్మన్​ పదవికి దరఖాస్తుల ఆహ్వానం - ఐసీసీ ఛైర్మన్ వార్తలు

ఐసీసీ అధ్యక్షుడు శశాంక్​ మనోహర్​ పదవీకాలం త్వరలోనే ముగియనుండటం వల్ల ఆ పదవికి ఎన్నిక జరపాలని ఐసీసీ డైరెక్టర్స్​ బోర్డు నిర్ణయించింది. ఆసక్తిగా ఉన్న వాళ్లు అక్టోబరు 18లోగా వారి నామినేషన్లను దాఖలు చేయాలని ప్రకటన విడుదల చేసింది.

New ICC Chairman: Nomination for potential candidates by Oct 18, voting process yet to be decided
ఐసీసీ ఛైర్మన్​ పదవికి దరఖాస్తుల ఆహ్వానం
author img

By

Published : Oct 12, 2020, 5:39 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నిక జరగనుంది. బాధ్యతలు చేపట్టాలనుకున్న వారు అక్టోబరు 18 లోగా తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని ఐసీసీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఐసీసీ ఛైర్మన్​గా ప్రస్తుతం శశాంక్​ మనోహర్ ఉన్నారు. త్వరలోనే ఆయన పదవీ కాలం ముగియనుండటం వల్ల ఐసీసీ ఈ ఎన్నిక ప్రకటన జారీ చేసింది.

ఐసీసీ ఆడిట్​ కమిటీ స్వతంత్ర ఛైర్మన్​ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అయితే దీనికి సంబంధించిన గ్లోబల్​ బాడీ ఓటింగ్ విధానాన్ని తెలియజేయలేదు. ఎన్నికయ్యే కొత్త ఛైర్మన్​ డిసెంబరు నుంచి బాధ్యతలు చేపడతారని ఐసీసీ స్పష్టం చేసింది.

ఐసీసీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి నామినేషన్​ దాఖలు చేయాలంటే అంతర్జాతీయ క్రికెట్ మండలిలో డైరెక్టర్​గా పనిచేస్తున్న లేదా పనిచేసిన అనుభవం కచ్చితంగా ఉండాలని ఐసీసీ డైరెక్టర్ల బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.