విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అందుకున్న తర్వాత టీమ్ఇండియాలో చాలా మార్పులు తీసుకొచ్చాడని ఇషాంత్ శర్మ చెప్పాడు. వాటిలో ముఖ్యమైనది ఫిట్నెస్ అని అన్నాడు. ఇటీవల ఓ క్రీడా వెబ్‌సైట్‌తో ఇషాంత్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.
"జట్టులోని ప్రతి ఒక్కరికి అతడు ఉదాహరణగా నిలిచాడు. టీమ్ఇండియాలో ఇంతకు ముందెప్పుడు వినని, కొవ్వు శాతం గురించి నాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఆటగాళ్లకు ప్రతిభతో పాటు ఫిట్నెస్ కూడా ఉంది. తన కోసం తాను ఏర్పాటు చేసుకున్న నియమాలు సహచర క్రికెటర్ల ఆచరించడం వల్ల జట్టు రూపరేఖలే మారిపోయాయి" అని కోహ్లీ గురించి ఇషాంత్ చెప్పాడు.
ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా ఇషాంత్ శర్మ తన 100వ అంతర్జాతీయ టెస్టు ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీ అందుకున్న తర్వాత 40 టెస్టులాడిన ఇతడు.. 113 వికెట్లు తీసి సత్తా చాటాడు.