ప్రస్తుత క్రికెటర్లతో పోలిస్తే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమమని చెప్పాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్. తామిద్దరూ స్నేహితులుగా మారడం, తన అదృష్టంగా భావిస్తున్నట్లు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు కోహ్లీకి కొంత సమయమే పట్టింది. ప్రస్తుతం అతడి అనేక రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికీ కోహ్లీకి పరుగుల దాహం తీరలేదు. మరోవైపు తనకున్న పరిణితితో కెరీర్లో మంచి నిర్ణయాలను తీసుకుంటున్నాడు. అది అతనికి సహజ సిద్ధంగా వచ్చిందే అయినా తనను తాను కొత్తగా మార్చుకునేందుకు ప్రతిరోజు కష్టపడుతుంటాడు. అలాంటి క్రికెటర్‌తో కలిసి ఆడటం నిజంగా నా అదృష్టం. చిన్న వయసులోనే కోహ్లీని కలవడం, అతడి పురోగతిని, ప్రయాణాన్ని చూస్తూ రావడం చాలా బాగుంది"
- కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
![Natural ability, drive to improve make Kohli a record-breaking batsman: Williamson](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7531113_2.jpg)
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ప్రత్యేకమైన అభిమానమని విలియమ్సన్ ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాము మంచి స్నేహితులమని.. అభిరుచులు, ఆలోచనలూ ఒకటేనని వెల్లడించాడు. అయితే విరాట్ నుంచి ఓ నైపుణ్యాన్ని తీసుకునే అవకాశం వస్తే ఏది ఎంచుకుంటారని అడగ్గా.. కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసేసుకుంటానని నవ్వుతూ చెప్పాడు విలియమ్సన్.
ఇదీ చూడండి... ఈ దిగ్గజాల కోరిక తీరలేదు.. కల నెరవేరలేదు!