ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్ నటరాజన్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు తీశాడు. తొలుత జట్టు స్కోర్ 200 వద్ద మాథ్యూవేడ్(45)ను ఔట్ చేసిన నట్టూ కాసేపటికే మార్నస్ లబుషేన్(108)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 213 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గ్రీన్, టిమ్‌పైన్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 71 ఓవర్లకు 224/5తో కొనసాగుతోంది.
అంతకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్(1) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన లబుషేన్.. స్మిత్(36)తో కలిసి మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇక రెండో సెషన్‌లో స్మిత్ ఔటయ్యాక.. వేడ్(45)తో జోడీ కట్టి 113 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సిరాజ్ వేసిన 63వ ఓవర్ చివరి బంతికి 4 పరుగులు చేసి లబుషేన్ టెస్టుల్లో 5వ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 50 పరుగులలోపే అతను రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రహానె ఒక క్యాచ్ వదలగా, రెండోసారి పుజారా స్లిప్‌లో లబుషేన్ క్యాచ్ జారవిడిచాడు.
ఇదీ చూడండి: బ్రిస్బేన్ టెస్టు: గాయంతో మైదానాన్ని వీడిన సైనీ