టీమ్ఇండియా యువబౌలర్ నటరాజన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా, షమి వంటి బౌలర్లు లేకపోయినా ఒత్తిడిలోనూ నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని తెలిపాడు. బౌలింగ్‌లో ఇలానే నిలకడ కొనసాగిస్తే.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కించుకుంటాడని అభిప్రాయపడ్డాడు.
"నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బుమ్రా, షమి లేకపోయినా.. ఒత్తిడిలోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అతడు అంతర్జాతీయ స్థాయిలోనే తన తొలి మ్యాచ్ ఆడడం విశేషం. నటరాజన్ కష్టపడే తత్వంతో పాటు వినమ్రతతో ఉంటాడు. జట్టులో ఒక లెఫ్టార్మ్ పేసర్ ఉండడం టీమ్‌కు కలిసొచ్చే అంశం. ఆటలో ఇలాంటి నిలకడతోనే ఉంటే వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో అతడు భాగమయ్యే అవకాశం ఉంది. అతడే కీలకంగానూ ఉంటాడు".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
మనసు చాటుకున్న హార్దిక్..
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'కు ఎంపికయ్యాడు. అయితే ఈ అవార్డుకు బౌలర్ నటరాజన్ సరైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' ట్రోఫీని నటరాజన్‌కు అందజేసి.. హార్దిక్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.
అవకాశం.. సద్వినియోగం
ఆస్ట్రేలియా పర్యటనకు అదనపు బౌలర్‌గా ఎంపికైన నటరాజన్.. పేసర్ శివమ్ దూబే గాయమైన కారణంగా అనూహ్యంగా సిరీస్‌లోని చివరి వన్డేలో అవకాశం దక్కించుకున్నాడు. డిసెంబరు 2న ఆస్ట్రేలియాతో జరిగిన ఆ చివరి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా తన ప్రదర్శనతో అందర్నీ మెప్పించాడు.
4 మ్యాచ్‌లు.. 8 వికెట్లు
అరంగేట్రం చేసిన వన్డేలో 2 వికెట్లు సాధించిన నటరాజన్.. ఆ తర్వాత ఆడిన మూడు టీ20ల్లో ఆరు వికెట్లు సాధించాడు. వీటితో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో, తన అస్త్రమైన యార్కర్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు నటరాజన్.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియాదే చివరి మ్యాచ్.. సిరీస్ మాత్రం భారత్‌దే