ETV Bharat / sports

'రోహిత్​ను ఔట్ చేస్తే నా కల నెరవేరినట్లే' - నసీమ్ షా వార్తలు

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఔట్ చేస్తే తన కల నిజమైనట్లే అని తెలిపాడు పాకిస్థాన్ యువ సంచలనం నసీమ్ షా. అలాగే స్టీవ్ స్మిత్, జో రూట్​లను కూడా ఔట్ చేయాలనుందని వెల్లడించాడు.

నసీమ్ షా
నసీమ్ షా
author img

By

Published : Jul 17, 2020, 6:54 PM IST

టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం తన కల అని పాకిస్థాన్‌ యువ సంచలనం నసీమ్‌ షా తెలిపాడు. హిట్‌మ్యాన్‌తో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌లను కూడా ఔట్‌ చేయాలని ఉందని చెప్పాడు. తొలుత రోహిత్‌ శర్మ గురించి స్పందించిన నసీమ్‌.. భారత ఓపెనర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

"రోహిత్‌కు అన్ని బంతులూ ఆడే సామర్థ్యం ఉంది. బ్యాటింగ్‌ రికార్డులే అతడి గురించి చెబుతాయి. అతడి వికెట్‌ తీస్తే నా కల నిజమైనట్లే. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌కు అసహజమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఉంది. అతడిని ఔట్‌ చేయడం కూడా నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో స్మిత్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం లభించింది. కానీ ఔట్‌ చేయలేకపోయా."

-నసీమ్ షా, పాక్ బౌలర్

అయితే రోహిత్‌, స్మిత్‌ను ఔట్‌ చేయాలంటే నసీమ్‌ మరింత కాలం వేచి చూడక తప్పదు. ఎందుకంటే పాకిస్థాన్‌ సమీప భవిష్యత్‌లో టీమ్‌ఇండియాతో కానీ, ఆస్ట్రేలియాతో కానీ ఆడే అవకాశం లేదు. అయితే, వచ్చేనెల మాత్రం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఔట్‌ చేసే అవకాశం ఈ పాక్‌ బౌలర్‌కు ఉంది. ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్‌, పాక్‌ జట్లు మూడు టెస్టులు ఆడబోతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.