లక్ష్యాన్ని ఛేదించాలన్నా, ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయాలన్నా అతడికే సాధ్యం. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు టీమిండియా కెప్టెన్ కోహ్లి. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది మెన్ ఇన్ బ్లూ.
ఒక్కడై నిలిచిన కోహ్లి..
ఈ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకముందే రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 21 పరుగులు చేసిన తర్వాత ధావన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి 48 ఓవరు వరకు నిలిచి 116 పరుగులు సాధించాడు. భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. కెరీర్లో 40వ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Well and truly the 👑#INDvAUS pic.twitter.com/qDNlsP72VE
— BCCI (@BCCI) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Well and truly the 👑#INDvAUS pic.twitter.com/qDNlsP72VE
— BCCI (@BCCI) March 5, 2019Well and truly the 👑#INDvAUS pic.twitter.com/qDNlsP72VE
— BCCI (@BCCI) March 5, 2019
విజయ్ ఉండుంటే..
ఉన్నంత సేపు ధాటిగా ఆడిన విజయ్ శంకర్ 46 పరుగులు చేసి జట్టుకు విలువైన భాగస్వామ్యం అందించాడు. జంపా బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో రాయుడు 18, జాదవ్ 11 రన్స్ చేశారు. ధోని డకౌట్ అయ్యాడు.
జడేజా రికార్డు..
ఈ మ్యాచ్‌లో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డేల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు జడేజా. 21 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
కంగారూల సమష్టి బౌలింగ్..
Innings Break!
— BCCI (@BCCI) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
116 runs from the Skipper along with a gritty 46 from Shankar guides #TeamIndia to a total of 250 in 50 overs.
Will #TeamIndia defend it? #INDvAUS pic.twitter.com/8mxeCszOZR
">Innings Break!
— BCCI (@BCCI) March 5, 2019
116 runs from the Skipper along with a gritty 46 from Shankar guides #TeamIndia to a total of 250 in 50 overs.
Will #TeamIndia defend it? #INDvAUS pic.twitter.com/8mxeCszOZRInnings Break!
— BCCI (@BCCI) March 5, 2019
116 runs from the Skipper along with a gritty 46 from Shankar guides #TeamIndia to a total of 250 in 50 overs.
Will #TeamIndia defend it? #INDvAUS pic.twitter.com/8mxeCszOZR
గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా రెండు వికెట్లు తీసి మరోసారి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ వన్డేలో హీరోలు జాదవ్, ధోనిలను ఔట్ చేసి భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. విజయ్ శంకర్‌ను రనౌట్ చేసింది ఇతడే.
రోహిత్ ,కోహ్లి, జడేజా, కుల్దీప్ వికెట్లు తీసి మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు కమిన్స్. తలో వికెట్ తీసిన కౌల్టర్‌నైల్, మాక్స్వెల్, లైయన్ తమ వంతు పాత్ర పోషించారు.
ఈ వేదికలో జరిగిన 8 వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. కానీ నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది.