ETV Bharat / sports

'ఐపీఎల్​లో ప్రదర్శనే అక్కడా కొనసాగిస్తా' - ఆస్ట్రేలియాతో సిరీస్​ కేఎల్​ రాహుల్​

ఈ ఐపీఎల్​లో చేసిన ప్రదర్శననే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లోనూ పునరావృతం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్​. తన బ్యాటింగ్​ స్థానం.. ఆడే ఫార్మాట్​ ఆధారంగా ఉంటుందని అన్నాడు.

Rahul
కేఎల్​ రాహుల్
author img

By

Published : Nov 25, 2020, 8:50 PM IST

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లో తన బ్యాటింగ్​ స్థానం.. ఆడే ఫార్మాట్​పై ఆధారపడి ఉంటుందని అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్​​ కేఎల్​ రాహుల్​. ఐపీఎల్-13​లో అద్భుత ప్రదర్శన చేసినట్లుగానే ఈ సిరీస్​లోనూ బాగా ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు.

"నా బ్యాటింగ్​ స్థానం ఫార్మాట్​, జట్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గతసారి వన్డే సిరీస్​లో ఐదో స్థానంలో బ్యాటింగ్​ చేయడాన్ని బాగా ఆస్వాదించాను. జట్టు ఏ స్థానంలో ఆడమన్నా నేను సంతోషమే. ఈ ఐపీఎల్​లో బాగా ఆడి మంచి అనుభూతిని పొందాను. అదే ప్రదర్శనను ఆస్ట్రేలియాపైనా పునరావృతం చేయాలనుకుంటున్నా. అయితే ఆసీస్​తో సిరీస్​ సవాల్​తో కూడుకున్నది. కానీ ఈ సిరీస్​ను ఆస్వాదిస్తూ.. నా వరకు మంచిగా ఆడటానికి ప్రయత్నిస్తాను. మిగతా ఆటగాళ్లను చూసుకోవడం కోసం సారథి విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. కాబట్టి నా పని ఇంకా తేలికవుతుంది.''

-కేఎల్​ రాహుల్​, టీమ్​ఇండియా క్రికెటర్​.

సాధారణంగా పరిమిత ఓవర్ల సిరీస్​కు వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ. కానీ ఐపీఎల్​లో గాయపడ్డ కారణంగా ఈ సిరీస్​కు హిట్​మ్యాన్​ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాత్కాలిక వైస్​ కెప్టెన్​గా రాహుల్​ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్​లో 14 మ్యాచులు ఆడిన రాహుల్​.. అత్యధికంగా 674 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్​​ క్యాప్​ను సొంతం చేసుకున్నాడు.

ఇదీ చూడండి : 'కోహ్లీ గైర్హాజరీ టీమ్​ఇండియాకు ప్రతికూలాంశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.