క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్.. ముంబయి జట్టులో ఉన్నాడా? లేకపోతే మరి యూఏఈ ఎందుకు వెళ్లాడు? స్మిమ్మింగ్ పూల్‌లో ముంబయి ఇండియన్స్ క్రికెటర్లతో ఉన్న అర్జున్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో అభిమానులకు ఇవే సందేహాలు కలుగుతున్నాయి.
అర్జున్ నెట్ బౌలర్‌గా ముంబయి జట్టుతో వెళ్లాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అతడు గతంలోనూ ముంబయి ఆటగాళ్లకు బంతులేశాడు. అందుకే అతడిని జట్టుతో పాటు తీసుకెళ్లారు. గతంలో అతడు ప్రాక్టీస్ సమయంలో వేసిన యార్కర్‌కు బెయిర్‌స్టో గాయపడ్డాడు. ఏదైనా కారణాల వల్ల ముంబయికి చెందిన ఆటగాళ్లు లీగ్‌కు దూరమైతే ఆ స్థానంలో అర్జున్ను తీసుకునే అవకాశం ఉంది.