ETV Bharat / sports

సచిన్​ ఔట్​ అని నేను అనలేదు: ఎమ్మెస్కే - ఎమ్మెస్కే ప్రసాద్​ లేటెస్ట్​ న్యూస్​

గతంలో సచిన్​ను ఔట్​గా ప్రకటించిన అంపైర్​ డారిల్​​ నిర్ణయాన్ని తాను సమర్థించలేదని టీమ్​ఇండియా మాజీ ఆటగాడు, మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్​ చెప్పాడు.

MSK refutes Harper's claim on Sachin dismissal, says umpire was carrying guilt for long time
సచిన్​ ఔట్​ను నేను సమర్థించలేదు: ఎమ్మెస్కే ప్రసాద్​
author img

By

Published : Jul 24, 2020, 8:28 AM IST

1999లో జరిగిన ఆడిలైడ్​ టెస్టులో సచిన్​ను వివాదాస్పద "షోల్డర్​ బిఫోర్​ వికెట్"​ ఔట్​గా ప్రకటించిన అంపైర్​ డారిల్​ హార్పర్​ నిర్ణయాన్ని తాను సమర్థించలేదని టీమ్​ఇండియా మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్​ స్పష్టం చేశాడు. సచిన్​ విషయంలో తన నిర్ణయం పట్ల ఇప్పటికీ గర్విస్తున్నానని డారిల్​ ఇటీవల తెలిపాడు. సచిన్​కూ ఇది ఔటని తెలుసని 2018లో అదే మైదానంలో అప్పటి జట్టులోని వికెట్​కీపరైన ప్రసాద్​ను కలిసినప్పుడు తనకు చెప్పాడని డారిల్​ పేర్కొన్నాడు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, సచిన్​ ఆ ఔట్​ను ఒప్పుకున్నట్లు డారిల్​తో తాను అనలేదని ప్రసాద్​ చెప్పాడు.

"ఆ తప్పుడు నిర్ణయం పట్ల డారిల్​ చాలా కాలం పాటు పశ్చాత్తాపం చెందాడు. 2018 టెస్టు సిరీస్​ సందర్భంగా అతను భోజనాల గదిలో నన్ను కలిశాడు. వివాదాస్పదంగా మారిన తన నిర్ణయం పట్ల సచిన్ స్పందన ఏమిటీ అనే నన్ను అడిగాడు. 'నువ్వు ఇచ్చిన నిర్ణయం ఔటైనా లేదా కాకపోయినా కూడా సచిన్​ ఎప్పుడూ అంపైర్​ నిర్ణయాలను ప్రశ్నించే వ్యక్తి కాదు. అందుకే అతను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. భారత క్రికెట్​ దేవుడిగా ఎదిగాడు' అని అతనికి చెప్పా. అంతేకానీ డారిల్​ అన్నట్లు సచిన్​ ఔట్​ అని నేనెప్పుడూ చెప్పలేదు. అది అబద్ధం. ఆ నిర్ణయం ఇవ్వగానే అప్పటి డ్రెస్సింగ్​ రూమ్​లో ఉన్న మేమందరం షాక్​కు గురయ్యాం" అని ప్రసాద్​ పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.