ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాళ్లకు క్రికెట్ మెళకువలు నేర్పించనున్నాడు. అందుకోసం మంగళగిరికి వచ్చిన ఈ బౌలర్.. ఈటీవీ భారత్‌తో మాట్లాడాడు. స్లెడ్జింగ్‌పై తన అభిప్రాయాలు సహా బౌలర్లు ఏ విధంగా సన్నద్ధమవ్వాలో చెప్పాడు.
స్లెడ్జింగ్
"స్లెడ్జింగ్ ఆరోగ్యకరంగా ఉన్నంత సేపు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది వ్యక్తిగతంగా, అవమానకరంగా మారితే మంచిది కాదు" అని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ మెక్‌గ్రాత్.
"స్లెడ్జింగ్ అనేది దూషించడం లేదా కొట్టుకోవడం కాదు. వ్యక్తిగతంగా అవమానించేలా ఉండకూడదు. మైదానంలో జరిగే ఆరోగ్యకరమైన పోటీలో భాగమది. దాన్ని తప్పుగా నేనైతే భావించను. ఇలాంటివి క్రికెట్లో ఒక్కోసారి జరుగుతుంటాయి. సచిన్, నాకు మధ్య ఇలాంటి చిన్న ఘర్షణ ఒకసారి జరిగింది. ఎదుటి వ్యక్తిని దూషించడం అసలు క్రికెట్లో ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు." -గ్లెన్ మెక్‌గ్రాత్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్
దిగ్గజ క్రికెటర్ మెక్‌గ్రాత్.. మంగళగిరికి రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. అతడి శిక్షణలో మెళకువలు నేర్చుకునేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశమని అన్నారు.
ఇవీ చూడండి.. బీసీసీఐ-నాడా బంధంపై క్రీడా శాఖ మంత్రి హర్షం