కరోనా కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉంటున్నారు. తమ అభిమానులతో ముచ్చటించడం, జ్ఞాపకాలను పంచుకోవడం చేస్తున్నారు. తాజాగా టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన సోదరుడు కృనాల్ పాండ్యతో కలిసి 2011లో దిగిన చిత్రాన్ని పంచుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయామని దానికి వ్యాఖ్య జతచేశాడు.
- View this post on Instagram
Throwback to 2011 😅 How time changes @krunalpandya_official Swag mera desi hai
">
ఇక టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తమ కుటుంబంతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఇద్దరూ సరదా వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు.
మాజీ సారథి ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి కూడా సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉంటున్నారు. వీడియోగేమ్స్‌తో బిజీగా మారిపోయిన ధోనీ నుంచి సమయాన్ని కోరుకుంటున్నానని ఓ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోగేమ్స్ vs భార్య అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">