తాను ప్రతిభావంతుడిని కావడం వల్లే ధోనీ తనకు మద్దతిచ్చాడని సురేశ్ రైనా అన్నాడు. రైనా.. మహీ ఫేవరెటని ఇటీవల యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతడు స్పందించాడు.
"ధోనీ నాకు మద్దతుగా నిలిచాడనడంలో సందేహం లేదు. నాలో ప్రతిభ ఉందని తెలుసు కాబట్టే అతడు నాకు అండగా ఉన్నాడు. ధోనీ నాయకత్వంలో భారత జట్టు, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున సత్తా చాటా"
-- సురేశ్ రైనా, టీమిండియా సీనియర్ క్రికెటర్
కొన్నిసార్లు విఫలమైతే.. ఆటగాళ్లను మహీ హెచ్చరిస్తాడని, తనను కూడా హెచ్చరించాడని చెప్పాడు. అవే తప్పులు పునరావృతం చేయనని ధోనీకి నచ్చచెప్పే వాడినని రైనా తెలిపాడు.
2011 ప్రపంచకప్ సందర్భంగా రైనా పెద్దగా ఫామ్‌లో లేడని, ధోనీ మద్దతుతో తుది జట్టులో ఆడాడని యువరాజ్ ఇంతకుముందు వ్యాఖ్యానించాడు. యువరాజ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. రైనా భారత జట్టుకు దూరమై రెండేళ్లవుతోంది.
ఇదీ చూడండి... నేడే ఐసీసీ సమావేశం.. టీ20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం