ETV Bharat / sports

ధోనీ నిర్మాణంలో 'అఘోరా' వెబ్ సిరీస్ - IPL DHONI

మాజీ కెప్టెన్ ధోనీ నిర్మాణంలో పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ అంశాలున్న వెబ్​ సిరీస్​ను త్వరలో తెరకెక్కించనున్నారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

MS Dhoni to produce mythological sci-fi web-series
ధోనీ
author img

By

Published : Sep 30, 2020, 3:01 PM IST

నిర్మాతగా గతేడాది తొలి అడుగు వేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 'ధోనీ ఎంటర్​టైన్​మెంట్స్' సారథ్యంలో 'రోర్ ఆఫ్ లయన్' డాక్యుమెంటరీ సిరీస్​ తీశాడు. ఇప్పుడు పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ అంశాలున్న వెబ్ సిరీస్​ను​ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. నటీనటుల అన్వేషణలో చిత్రబృందం ప్రస్తుతం నిమగ్నమై ఉంది.

కొత్త రచయిత రాసిన, ప్రచురణ కాని ఓ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్​ను రూపొందించనున్నారు. ఇది థ్రిల్లింగ్ అడ్వంచర్​గా ఉంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాక్షి సింగ్ ధోనీ చెప్పారు. ​

"ఓ అఘెరా ప్రయాణాన్ని ఈ సిరీస్​ చూపించనుంది. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ అంశాలు ప్రేక్షకుల్ని థ్రిల్​కు గురిచేస్తాయి" అని సాక్షి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.