ETV Bharat / sports

ధోనీ 'పబ్​జీ' ఆపేసి ఆ గేమ్​ ఆడుతున్నాడట!

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ.. చాలా కాలం కిందటే 'పబ్​జీ'ని మానేసి మరో గేమ్ ఆడటం ప్రారంభించాడని చెప్పాడు భారత బౌలర్​ దీపక్​ చాహర్​. అయితే తాను మాత్రం ఇంకా పబ్​జీ కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.

author img

By

Published : Sep 3, 2020, 7:19 PM IST

Dhoni
ధోనీ 'పజ్బీ'

దేశ భద్రత దృష్ట్యా ప్రముఖ గేమ్ 'పబ్​జీ' సహా 118 చైనా యాప్​లను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో పబ్​జీని ఎంతో ఇష్టంగా ఆడే ధోనీపై నెట్టింట్లో మీమ్స్​ వైరల్​ అయ్యాయి. 'మహీ ఇకపై ఏ ఆట ఆడుతాడో మరి?' అంటూ నెటిజన్లు ట్రోల్​ చేశారు. తాజాగా దీనిపై స్పందించిన టీమ్​ఇండియా బౌలర్​ దీపక్ చాహర్​.. మహీకి ఈ ఆట​పై ఎప్పుడో పట్టు తప్పిందని చెప్పాడు. బ్యాన్​ చేయకముందే కాల్​ ఆఫ్​ డ్యూటీ(కాడ్​) అనే మరో గేమ్​ను ఆడటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే తాను మాత్రం ఆ ఆటను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.

"పబ్‌జీ.. ఇంకా ఆ గేమ్‌ను ఆడుతున్నా. కానీ ధోనీ ఆడట్లేదు. దానిపై మహీకి పట్టు పోయింది. ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు. అతడు ఇప్పుడు మరో గేమ్‌ 'కాల్‌ ఆఫ్‌ డ్యూటీ'తో బిజీగా ఉంటున్నాడు" అని చాహర్ చెప్పాడు.

ధోనీతో పాటు క్రికెటర్స్​ కేఎల్​ రాహుల్​, కేదర్ జాధవ్​, హార్దిక్​ పాండ్య, యుజ్వేంద్ర చాహల్​, శిఖర్​ ధావన్​ కూడా పబ్​జీ ఆట ప్రియులే. ప్రస్తుతం ఐపీఎల్​ కోసం దుబాయ్​లో ఉన్న ధోనీ, చాహర్‌.. క్వారంటైన్​లో గడుపుతున్నారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఈ లీగ్​ జరగనుంది.

ఇదీ చూడండి ఐపీఎల్​: తొలి మ్యాచ్​ సీఎస్కే-ముంబయి మధ్యనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.