ETV Bharat / sports

ఆన్​లైన్​ శిక్షణ ఇస్తూ ధోనీ, అశ్విన్ బిజీ బిజీ - స్వయంగా ఆన్​లైన్​ సెషన్స్​లో ట్రైనీలకు క్రికెట్​ శిక్షణ అశ్విన్

తమ అకాడమీలోని ట్రైనీలకు ఆన్​లైన్​లో శిక్షణ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్.

MS Dhoni, Ravichandran Ashwin facilitate online cricket coaching amid lockdown
'ఆన్​లైన్​ ద్వారా ట్రైనీలకు శిక్షణ'
author img

By

Published : Apr 11, 2020, 1:33 PM IST

భారత ప్రముఖ క్రికెటర్లు ధోనీ, అశ్విన్.. లాక్​డౌన్​ వల్ల తమ అకాడమీల్లోని యువ ఆటగాళ్లకు ఆన్​లైన్​ ద్వారా శిక్షణనిస్తూ బిజీగా ఉన్నారు. అయితే మహీ.. స్వయంగా ఈ సెషన్స్​లో పాల్గొనట్లేదు. ట్రైనింగ్ ఇస్తున్న కోచ్​లకు అంతర్జాలం​ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. ఫిట్​నెస్​పై బోధించాల్సిన అంశాలను వివరిస్తున్నాడు. అనంతరం సదరు కోచ్​లు, ఫేస్​బుక్​ లైవ్ ద్వారా ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నారు.

"ఆన్​లైన్ కోచింగ్ పట్ల ట్రైనీస్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో వీడియోకు దాదాపు 10వేలకు పైగా వీక్షణలు వస్తున్నాయి. మా డెమో డ్రిల్స్​ను 'క్రికెటర్'​ యాప్​ ద్వారా అప్​లోడ్​ చేస్తున్నాం. ట్రైనీలు వారి సాధన వీడియోలను ఇదే యాప్​లో పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా వారి​ సాధనను పర్యవేక్షిస్తున్నాం."

-సత్రాజిత్ లహిరి , ధోనీ క్రికెట్ అకాడమీ చీఫ్ కోచ్

స్వయంగా ఆన్​లైన్​ సెషన్స్​లో

స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్.. తన అకాడమీని ఇదే బాటలో తీసుకువెళుతున్నాడు. శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లకు ఆన్​లైన్​ ద్వారానే పాఠాలు బోధిస్తున్నారు. కొన్నిసార్లు స్వయంగా అశ్విన్ కోచింగ్ సెషన్స్​లో పాల్గొంటున్నాడు.

ఇదీ చూడండి : దిల్లీ పోలీసులకు కెప్టెన్ కోహ్లీ సెల్యూట్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.