ETV Bharat / sports

ధోనీ ఇంట్లో ప్రాక్టీసు చేస్తున్నది అందుకే: రైనా - ఐపీఎల్​ 2020 న్యూస్​

ధోనీ ఇంట్లోనే తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నాడని చెప్పిన రైనా.. అతడికి ఫిట్​గా ఉండేందుకు అలాంటి శిక్షణ పొందుతున్నాడని అన్నాడు. యూఏఈ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

MS Dhoni is training hard at home, everyone has to do it: Suresh Raina
'ధోనీ ఇంట్లో.. నేను మైదానంలో ప్రాక్టీసు చేస్తున్నాం'
author img

By

Published : Aug 4, 2020, 2:04 PM IST

దుబాయ్ వెళ్లేందుకు తామంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని అన్నాడు సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా. టోర్నీ ప్రారంభానికి 18-20 రోజుల ముందే యూఏఈకి చేరుకోవచ్చని అన్నాడు. ఇప్పటికే స్వస్థలం ప్రాక్టీసు చేస్తున్న రైనా.. ఆ వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.

"ఐపీఎల్​ ప్రారంభానికి 18-20 రోజుల ముందు యూఏఈ చేరుకుని అక్కడే ప్రాక్టీస్​ చేయనున్నాం. ఇప్పటికే నాలుగైదు నెలలుగా లాక్​డౌన్​లో ఉన్నాం. కాబట్టి ఐపీఎల్​ ఆడటానికి ముందు అక్కడికి వెళ్లడం మంచిది. ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లతో మాట్లాడాను. వారు ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. చాలా ఫిట్​నెస్ అవసరం కాబట్టి ధోనీ, ఇంట్లోనే కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు"

-సురేశ్​ రైనా, టీమ్​ఇండియా క్రికెటర్​

టీమ్ఇండియా యువక్రికెటర్​ రిషబ్​ పంత్​ కూడా ఘజియాబాద్​లోనే శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రాక్టీసులో పంత్​.. బంతిని బాగా కొట్టాడని భవిష్యత్​లో మంచి బ్యాట్​మన్​గా ఎదుగుతాడని సురేశ్​ రైనా ప్రశంసించాడు. "పంత్​తో కలిసి ప్రాక్టీసు చేస్తున్నా. అతడు బంతిని బాగా బాదుతున్నాడు. బ్యాటింగ్​ చక్కగా చేస్తున్నాడు. అతడికి మంచి భవిష్యత్​ ఉంది. జట్టులోని సహచరులు పంత్​ను జాగ్రత్తగా చూసుకోవాలి" అని సురేశ్​ రైనా చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.