లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన క్రికెటర్లందరూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అభిమానులతో ముచ్చటించిన పాక్ ఆటగాడు కమ్రాన్ అక్మల్.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరఫున వికెట్ కీపర్‌గా ధోనీ కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.
"ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలని భావిస్తున్నారు?" అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు స్పందించిన కమ్రాన్.. ఒకవేళ మహీ వికెట్‌కీపర్‌గా ఉండకపోతే ప్రత్యామ్నయంగా కేఎల్ రాహుల్ ఆడాలని అన్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ జట్టులో వికెట్‌కీపర్‌గా కొనసాగుతున్నాడు.
-
i think it should be MS Dhoni & 2nd option KL Rahul
— Kamran Akmal (@KamiAkmal23) June 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">i think it should be MS Dhoni & 2nd option KL Rahul
— Kamran Akmal (@KamiAkmal23) June 12, 2020i think it should be MS Dhoni & 2nd option KL Rahul
— Kamran Akmal (@KamiAkmal23) June 12, 2020
దీంతో పాటు నెటిజన్లు అడిగిన మరకొన్ని ప్రశ్నలకు బదులిచ్చాడు కమ్రాన్. కోహ్లీ(టీమిండియా సారథి), బాబర్ (పాక్) అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని.. అబ్దుల్ రజాక్, జాక్వెస్ కలీస్(దక్షిణాఫ్రికా) అత్యుత్తమ ఆల్‌రౌండర్స్ అని చెప్పాడు.
ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల టీ20 ప్రపంచకప్ నిర్హహణ సందిగ్ధంలో ఉంది. మరోవైపు ఐపీఎల్లో సత్తాచాటి ప్రపంచకప్‌కు వెళ్లే భారత్ జట్టులో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. ప్రస్తుతం టోర్నీ నిరవధిక వాయిదా పడిన తరుణంలో అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది చూడండి : 'కోహ్లీ ఒక్కడు కాదు.. జట్టు మొత్తంతో సమానం'