ETV Bharat / sports

'బిగ్గెస్ట్ క్రికెటింగ్ మైండ్స్'​లో ధోనీ ఒకడు!

ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారని చెప్పిన మాజీ అంపైర్ సైమన్ టాఫెల్.. వారిని 'బిగ్గెస్ట్ క్రికెటింగ్ మైండ్స్' అని అన్నాడు.

'బిగ్గెస్ట్ క్రికెటింగ్ మైండ్స్'​లో ధోనీ ఒకడు!
ధోనీ -సైమన్ టాఫెల్
author img

By

Published : Aug 10, 2020, 10:37 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఆస్ట్రేలియా దిగ్గజాలు డారెన్ లెహ్​మన్, షేన్ వార్న్​లు.. 'బిగ్గెస్ట్ క్రికెటింగ్ మైండ్స్​' అని చెప్పాడు మాజీ అంపైర్ సైమన్ టాఫెల్. తన కెరీర్​లో చూసిన వారిలో ఈ ముగ్గురూ ఆటను అర్ధం చేసుకోవడంలో అత్యుత్తమమని అన్నాడు.

"ధోనీని అద్భుతమైన ఆటగాడు. క్రికెట్​లో అతడిది అత్యుత్తమ మైండ్స్​లో ఒకటి. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజాలు డారెన్ లెహ్​మన్, షేన్ వార్న్​ కూడా ఉన్నారు. ఎంతో ప్రశాంతంగా, రిలాక్స్​గా ఉండే ధోనీలో మంచి హాస్య చతురత ఉంది. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు"

-సైమన్ టఫెల్, మాజీ అంపైర్

అయితే ధోనీని క్రికెట్​కు సంబంధించిన వ్యక్తులు ప్రశంసించడం కొత్తేమి కాదు. ఎందుకంటే అతడు భారత తరఫున అద్భుత ప్రదర్శనలు చేయడం సహా టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్​లను సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచ్​ల్ని ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఇటీవలే పంచుకున్న స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్.. వికెట్ల వెనక మహీభాయ్ ఉంటే కోచ్​ అవసరం లేదని తెలిపాడు.

ఐపీఎల్​ కోసం ధోనీ ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున బరిలోకి దిగనున్నాడు. యూఏఈలో సెప్టెంబరు 19నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.