ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన సీఎస్కే అవార్డుల కార్యక్రమంలో జట్టులోని ప్రముఖ క్రికెటర్లు బహుమతులు అందుకున్నారు. ధోనీకి బంగారు టోపీ, రవీంద్ర జడేజాకు కత్తి, షేన్ వాట్సన్, బ్రావోలకు కూడా పలు అవార్డులు ఇచ్చారు. ఆ ఫొటోల్ని ట్వీట్ చేసింది చెన్నై సూపర్‌కింగ్స్.
-
Watto Man for giving his sweat and blood on the field for the #yellove cause. 🦁💛 pic.twitter.com/GKAgWb6LFG
— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watto Man for giving his sweat and blood on the field for the #yellove cause. 🦁💛 pic.twitter.com/GKAgWb6LFG
— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2020Watto Man for giving his sweat and blood on the field for the #yellove cause. 🦁💛 pic.twitter.com/GKAgWb6LFG
— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2020
-
Mr. Cricket for remaining ever super for over 10 years as our go-to Super King. 🦁💛 pic.twitter.com/f5C9oG51oj
— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mr. Cricket for remaining ever super for over 10 years as our go-to Super King. 🦁💛 pic.twitter.com/f5C9oG51oj
— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2020Mr. Cricket for remaining ever super for over 10 years as our go-to Super King. 🦁💛 pic.twitter.com/f5C9oG51oj
— Chennai Super Kings (@ChennaiIPL) September 17, 2020
లీగ్ ప్రారంభం నుంచి జట్టును విజయపథంలో నడిపిస్తున్న ధోనీకి బంగారు టోపీని అందజేసింది యాజమాన్యం. గత సీజన్లో జట్టులో అందరికంటే ఎక్కువ పరుగులు మహీనే చేశాడని గుర్తు చేసింది.
గత కొన్నేళ్ల నుంచి చెన్నైకి ఆడుతూ అద్భుత ప్రదర్శన చేస్తున్న జడేజాకు కత్తిని బహుకరించారు. ఐపీఎల్లో 100 వికెట్లకు పైగా తీసి, 1900 పరుగులు చేశాడని, లెఫ్టార్మ్ స్పిన్నర్లలో 108 వికెట్లు తీసిన తొలి బౌలర్ ఇతడేనని దానిపై రాశారు.
టీ20ల్లో ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరిన బ్రావో, సీనియర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్, పదేళ్ల నుంచి ఫ్రాంచైజీతో కొనసాగుతున్న మైక్ హస్సీలకు కూడా పలు బహుమతులు ప్రదానం చేశారు.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. సెప్టెంబరు 19న భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30కి మ్యాచ్ మొదలవుతుంది.