ETV Bharat / sports

'ధోనీ విజయాల వెనుక జహీర్​, గంగూలీల కఠోర శ్రమ' - ధోనీ గంగూలీ వచ్చే వియవంతమయ్యాడు

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ తన కెరీర్​లో సాధించిన విజయాల వెనుక గంగూలీ కఠోర శ్రమ ఉందని వివరించాడు గౌతమ్​ గంభీర్. దాదా నాయకత్వంలో అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ఎదిగిన క్రికెటర్లు మహీకి ఎంతో ఉపయోగపడ్డారని అన్నాడు.

sachin
ధోనీ
author img

By

Published : Jul 12, 2020, 6:01 AM IST

Updated : Jul 12, 2020, 6:28 AM IST

టీమ్​ఇండియా క్రికెట్ చరిత్రలో విజయవంతమైన సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. టీ20, వన్డేలలో జట్టును ప్రపంచ విజేతగా నిలపడం ధోనీకే సాధ్యమైంది. అయితే మహీ సాధించిన ట్రోఫీల వెనుక మాజీ సారథి సౌరభ్​​ గంగూలీ శ్రమ దాగివుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.

గంగూలీ నాయకత్వంలో మేటి ఆటగాళ్లుగా ఎదిగిన క్రికెటర్లు ధోనీకి ఎంతో ఉపయోగపడ్డారని తెలిపాడు గంభీర్​. ముఖ్యంగా జహీర్​ ఖాన్ లాంటి ఫాస్ట్​ బౌలర్​ మహీకి దొరకడం ఓ అదృష్టమని చెప్పాడు. ​

"టెస్టుల్లో ప్రపంచ నెం.1 సారథి​గా మహీ ఎదిగాడంటే అందుకు కారణం ఫాస్ట్​ బౌలర్​ జహీర్ ఖాన్. అతడికి జహీర్​ దొరకడం ఓ వరం అని చెప్పాలి. అయితే ఈ క్రెడిట్ అంతా గంగూలీకి దక్కుతుంది. ఎందుకంటే జహీర్​ను అగ్రశ్రేణి బౌలర్​గా మలిచింది గంగూలీనే."

-గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

దీంతో పాటు 2011 ప్రపంచకప్​లోనూ తనతో సహా సచిన్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లతో పటిష్టమైన జట్టు మహీకి లభించిందని అన్నాడు గంభీర్​.

ఇది చూడండి : అద్భుత ప్రపంచం 'డిస్నీ వరల్డ్'​ పునఃప్రారంభం.. కానీ

Last Updated : Jul 12, 2020, 6:28 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.