ETV Bharat / sports

టీమ్​ఇండియా కిట్​​ స్పాన్సర్​గా ఎంపీఎల్​ స్పోర్ట్స్​ - టీమ్​ఇండియా కిట్​ స్పాన్సర్​

టీమ్​ఇండియా కిట్​​ స్పాన్సర్​గా ఎంపీఎల్​ స్పోర్ట్స్​ ఎంపికైంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం విడుదల చేసింది.

MPL Sports is official Team India kit sponsor till 2023
టీమ్​ఇండియా కిట్​​ స్పాన్సర్​గా ఎంపీఎల్​ స్పోర్ట్స్​
author img

By

Published : Nov 17, 2020, 12:38 PM IST

టీమ్​ఇండియా అధికారిక వాణిజ్య భాగస్వామిగా ఈ-స్పోర్ట్స్​ ప్లాట్​ఫామ్​ ఎంపీఎల్​ ఎంపికైందని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. దీంతో పాటు కొత్త కిట్​ స్పాన్సర్​గానూ ఎంపీఎల్​ వ్యవహరించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఈనెల నుంచి డిసెంబరు 2023 వరకు మూడేళ్ల పాటు బీసీసీఐ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎమ్​పీఎల్ రూ.120 కోట్లు చెల్లించనుంది. ఈ డీల్ త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్​తోనే ప్రారంభం కానుందని బోర్డు వెల్లడించింది.

"2023 వరకు భారత పురుషుల, మహిళల జాతీయ క్రికెట్​ జట్టుకు కిట్​ స్పాన్సర్​గా ఎంపీఎల్​ స్పోర్ట్స్​ను నియమించడం వల్ల భారత క్రికెట్​లో కొత్త శకం ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాం. ఎంపీఎల్​ స్పోర్ట్స్​ టీమ్​ఇండియాకు కొత్త అధ్యాయాన్ని జోడించాలని మేము ఎదురుచూస్తున్నాం"

- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఎంపీఎల్​ స్పోర్ట్స్​ లైసెన్స్​డ్​ టీమ్​ఇండియా జెర్సీలనే కాకుండా.. ఆటకు సంబంధించిన అన్ని వస్తువులను విక్రయించడానికి ఈ సంస్థ అనుమతి పొందింది. దీనిపై ఎంపీఎల్​ స్పోర్ట్స్​ చెందిన అభిషేక్​ మాధవన్​ మాట్లాడుతూ.. "బీసీసీఐతో సన్నిహితంగా భాగస్వామ్యం కావాలని అన్ని రకాల టీమ్​ఇండియా వస్తువులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేం ఆశిస్తున్నాం. ఆన్​లైన్​లోనే కాకుండా ఆఫ్​లైన్​లోనూ సరసమైన ధరలకే విక్రయించనున్నాం. టీమ్​ఇండియాతో కలిసి పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం" అని అన్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.