ETV Bharat / sports

'కింగ్​' కోహ్లీ​ ఖాతాలో మరిన్ని రికార్డులు - టీ20ల్లో విరాట్​ రికార్డులుట

ఇంగ్లాడ్​తో జరిగిన చివరి టీ20లో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పలు రికార్డులు నమోదు చేశాడు. ఒక ద్వైపాక్షిక టీ-20 సిరీస్​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త ఫీట్​ సాధించాడు. ఇంకా కెప్టెన్​గా అత్యధిక పరుగులు, అత్యధిక అర్ధసెంచరీలు నమోదు చేశాడు.

Most runs in a bilateral T20I series (full member teams)231 VIRAT KOHLI
'కింగ్​' కోహ్లీ.. విరాట్​ ఖాతాలో మరిన్ని రికార్డులు!
author img

By

Published : Mar 21, 2021, 5:03 AM IST

Updated : Mar 21, 2021, 7:18 AM IST

ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో 5 మ్యాచ్​లు ఆడిన విరాట్​.. 231 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో కేఎల్​ రాహుల్​ 224 పరుగులతో(2020లో న్యూజిలాండ్​పై) తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోలిన్​ మన్రో- 223 పరుగులు (2018లో వెస్టిండీస్​పై- 3 మ్యాచ్​ల సిరీస్​), హామిల్టన్ మసకజ్జ 222 పరుగులు(బంగ్లాదేశ్​పై) 3, 4 స్థానాల్లో ఉన్నారు.

కెప్టెన్​గా..

  • ఇక కెప్టెన్‌గా టీ20ల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. ఫించ్ (1462)​, విలియమ్సన్(1383) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • పొట్టి ఫార్మాట్​లో కెప్టెన్​గా అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లీనే. 12 సార్లు సారథిగా 50కిపైగా స్కోరు సాధించాడు విరాట్​. ఈ జాబితాలో విలియమ్సన్​(11), ఫించ్​(10) తర్వాత నిలిచారు.
  • ఇంగ్లాండ్​పై టీ-20ల్లో మొత్తంగా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడూ కోహ్లీనే. చివరి టీ-20లో 80 పరుగులు చేసిన విరాట్​.. ఫించ్​ను దాటాడు.

చివరి మ్యాచ్​లో చేసిన 224 పరుగులే భారత్​కు ఇంగ్లాండ్​పై టీ-20ల్లో అత్యధిక స్కోరు.

ఇంగ్లాండ్​లో..

టీ-20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు ఇంగ్లాండ్​ ఆటగాడు డేవిడ్​ మలన్​. కేవలం 24 ఇన్నింగ్స్​ల్లోనే 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ వెయ్యి పరుగులు చేసేందుకు 27 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. బాబర్​ అజామ్​(పాక్​) 26 ఇన్నింగ్స్​ల్లో సాధించాడు.

ఇదీ చదవండి: ఆసిస్​-భారత్ 'తొలిపోరు'కు ప్రత్యేకతలెన్నో!

Last Updated : Mar 21, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.