టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్ ప్రతిభ గురించి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ ఆటగాడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. చివరగా ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ షమీ సున్నాకే పరిమితం అవడం విశేషం.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 416 పరుగులు చేసింది. విహారీ శతకంతో మెరవగా.. కోహ్లీ, ఇషాంత్ శర్మ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో షమీ మరోసారి డక్ ఔటయ్యాడు. మొత్తంగా చివరి ఆరు ఇన్నింగ్స్‌లోనూ సున్నాకే పరిమితమయ్యాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 433 పరుగు చేశాడీ పేసర్.
షమీ చివరి ఆరు ఇన్నింగ్స్ పరుగులు
0 (2) vs వెస్టిండీస్ (కింగ్ స్టన్)
0 (1) vs వెస్టిండీస్ (నార్త్ సౌండ్)
0* (3) vs ఆస్ట్రేలియా (మెల్బోర్న్)
0* (0) vs ఆస్ట్రేలియా (పెర్త్)
0 (1) vs ఆస్ట్రేలియా (పెర్త్)
0 (1) vs ఆస్ట్రేలియా (అడిలైడ్)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా... టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన కోహ్లీసేన.. రెండో మ్యాచ్‌లోనూ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది భారత్. రెండో రోజు ఆటముగిసే సమయానికి విండీస్ 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
ఇవీ చూడండి.. 'ఈ శతకం చూసి మా నాన్న గర్విస్తుంటారు'