అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్, ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయంపై నబీ మాట్లాడుతున్న ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకనున్నాడీ క్రికెటర్.
"గత 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నా. అఫ్గాన్‌కు టెస్టు హోదా తీసుకురావాలనే నా కల సాకారమైంది. మేము ఏడాదికి ఒకటి లేదా రెండు టెస్టులు మాత్రమే ఆడుతున్నాం. అందులో భాగమవ్వాలని నేను అనుకుంటాను. ప్రతి ఆటగాడు 5 రోజుల క్రికెట్ ఆడాలనుకుంటాడు. అందుకే ఇప్పుడు నా స్థానంలో యువ క్రీడాకారులకు అవకాశమివ్వాలని భావిస్తున్నా". -మహ్మద్ నబీ వీడియో సందేశం.
-
Experienced all-rounder @MohammadNabi007 announced his retirement from Test cricket confirming that the ongoing one-off match against @BCBtigers will be his last in the longest format.
— Afghanistan Cricket Board (@ACBofficials) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Find out more in the video below.#AFGvBAN @Farhan_YusEfzai pic.twitter.com/rkLbTxBwTH
">Experienced all-rounder @MohammadNabi007 announced his retirement from Test cricket confirming that the ongoing one-off match against @BCBtigers will be his last in the longest format.
— Afghanistan Cricket Board (@ACBofficials) September 7, 2019
Find out more in the video below.#AFGvBAN @Farhan_YusEfzai pic.twitter.com/rkLbTxBwTHExperienced all-rounder @MohammadNabi007 announced his retirement from Test cricket confirming that the ongoing one-off match against @BCBtigers will be his last in the longest format.
— Afghanistan Cricket Board (@ACBofficials) September 7, 2019
Find out more in the video below.#AFGvBAN @Farhan_YusEfzai pic.twitter.com/rkLbTxBwTH
టెస్టుల నుంచి వైదొలిగినా.. టీ-20, వన్డే ఫార్మాట్లో కొనసాగనున్నాడు మహ్మద్ నబీ. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడుతున్నాడు. 121 వన్డేలాడిన ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్... 2, 699 పరుగులతో పాటు 128 వికెట్లు తీశాడు. టీ 20ల్లో 1,161 పరుగులతో పాటు 69 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదీ చదవండి: 'ధోనికి సరైన రీతిలో వీడ్కోలు పలకాలి'