ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో సిరీస్​కు ఆమిర్, సోహైల్ దూరం - England cricket Board

ఆగస్టులో జరగనున్న ఇంగ్లాండ్​ పర్యటనకు పాకిస్థాన్​ క్రికెటర్లు హరిస్​ సోహైల్​, మహ్మద్​ ఆమిర్​లు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ వైదొలిగినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

Mohammad Amir, Haris Sohail withdraw their name from Pakistan's tour of England
ఇంగ్లాండ్ సిరీస్​కు పాక్​ ఆటగాళ్లు దూరం
author img

By

Published : Jun 12, 2020, 4:21 PM IST

పాకిస్థాన్​ ఆటగాళ్లు హరిస్​ సోహైల్​, మహ్మద్​ ఆమిర్​లు త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్​ పర్యటనకు దూరమయ్యారు. వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్​ నుంచి వైదొలిగినట్లు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది.

Mohammad Amir, Haris Sohail withdraw their name from Pakistan's tour of England
మహ్మద్​ అమీర్

"ఆగస్టులో తన భార్య రెండో శిశువుకు జన్మనివ్వబోతున్న కారణంగా ఆమిర్ ఈ సిరీస్​ నుంచి వైదొలిగాడు. హరిస్​ సోహైల్​ మాత్రం కుటుంబ కారణాల వల్ల ఇంగ్లాండ్​ పర్యటనకు రాలేకపోతున్నాడు. ఆగస్టు-సెప్టెంబరులో ఇంగ్లీష్​ గడ్డపై జరగనున్న మూడు టెస్టులు, మూడు టీ20లకు పాకిస్థాన్​ నుంచి మొత్తం 28 మంది ఆటగాళ్లతో పాటు 14 మంది సహాయ సిబ్బందిని పంపిస్తున్నాం."

- పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

​హరిస్​ సోహైల్​

ఇంగ్లాండ్​తో సిరీస్​ ఆడాలని పాక్​ క్రికెట్​ బోర్డు ముందు నుంచే సమాలోచనలు చేస్తోంది. కరోనా కారణంగా బయట మైదానాల్లో శిక్షణా శిబిరాల్లో ఆడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆటగాళ్లకు సూచించింది. అయితే ఈ సిరీస్​లో పాల్గొనడం లేదా విరమించుకోవడం అంతా ఆటగాడి వ్యక్తిగతమని.. దీని వల్ల క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోమని ఇటీవలే ఆ దేశ క్రికట్​ బోర్డు వెల్లడించింది.

ఈ పర్యటనకు ఆటగాళ్లను జులైలోనే ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్​ పంపనుంది పాక్​. సిరీస్​ ప్రణాళిక కంటే ముందుగానే అక్కడికి పంపి ఆటగాళ్లకు తగిన శిక్షణ ఇవ్వాలని చూస్తోంది. ఈ సిరీస్​ను బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు నిర్ణయించాయి.

ఇదీ చూడండి... క్రికెట్​లో అబద్ధాలు అనిపించే కొన్ని నిజాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.