కరోనా దృష్ట్యా క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే సమయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. అందుకోసం ఐసీసీ కొన్ని నిబంధనల్ని కూడా రూపొందించింది. బౌలర్లు, ఫీల్డర్లు బంతికి లాలాజయం రాయకుండా నిషేధించడం అందులో ఒకటి. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేశాడు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంతికి లాలాజలం రాస్తూ కనిపించాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసేటపుడు ఆమిర్ పదే పదే బంతికి లాలాజలం రాశాడు. ఈ దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి. అయితే దీనిని అంపైర్లు కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో పెనాల్టీ నుంచి పాక్ తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-
Mohammad Amir using saliva after every ball. @TheRealPCBMedia @ICC @ECB_cricket @ESPNcricinfo @TheRealPCB #PakvsEng #Amir #Cricket pic.twitter.com/Kv3yynr7hV
— Sultan (@smk_77) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mohammad Amir using saliva after every ball. @TheRealPCBMedia @ICC @ECB_cricket @ESPNcricinfo @TheRealPCB #PakvsEng #Amir #Cricket pic.twitter.com/Kv3yynr7hV
— Sultan (@smk_77) August 28, 2020Mohammad Amir using saliva after every ball. @TheRealPCBMedia @ICC @ECB_cricket @ESPNcricinfo @TheRealPCB #PakvsEng #Amir #Cricket pic.twitter.com/Kv3yynr7hV
— Sultan (@smk_77) August 28, 2020
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 16.1 ఓవర్లు ముగిసే సమయానికి 131/6 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం జోరు అందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ టామ్ బాంటన్ 71 పరుగులతో మెరిశాడు. బెయిర్‌స్టో (2) నిరాశపరిచాడు. డేవిడ్ మలన్ (23), ఇయాన్ మోర్గాన్ (14), మొయిన్ అలీ (8), లూయిస్ గ్రెగొరీ (2) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.