న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త మైలురాయికి చేరుకుంది. ఈ వన్డేతో 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్గా మిథాలీ చరిత్ర సృష్టించింది.
ఇప్పటికే మిథాలీ ఖాతాలో అత్యధిక పరుగుల రికార్డు ఉంది. తన వన్డే కెరీర్లో 51.33 సగటుతో 6,622 పరుగులు చేసింది. అందులో ఏడు శతకాలు ఉన్నాయి.
అయితే ఈ మ్యాచ్లో మిథాలీ పెద్దగా రాణించలేదు. 28 బంతుల్లో 9 పరుగులు చేసి వెనుదిరిగింది. మూడో వన్డేలో 149 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. రెండో వన్డేలో మాత్రం 63 పరుగులు చేసి భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించింది.
1999లో వన్డే కెరీర్ను ప్రారంభించిన మిథాలీ... జరిగిన ఆడిన 263 మ్యాచ్ల్లో 200 వన్డేలు ఆడటం విశేషం. వీటితో పాటు 10 టెస్టులు, 85 టీ20లు ఆడింది.