ETV Bharat / sports

హేలీ విజయం వెనుక ఉన్నది అతడే! - Women's T20 World Cup Final

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో.. ఆస్ట్రేలియా ఓపెనర్ అలీసా హేలీ తనదైన విధ్వంసకర ఆటతీరు ప్రదర్శించింది. కేవలం 39 బంతుల్లోనే​ 75 పరుగులు చేసింది. అయితే ఈ క్రీడాకారిణి వెనుక తన భర్త స్టార్క్​ మద్దతు బాగా పనిచేసినట్లు తెలుస్తోంది.

హేలీ
హేలీ
author img

By

Published : Mar 8, 2020, 5:49 PM IST

ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ మహిళల విజయం వెనుక కూడా ఓ పురుషులుంటారు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్​ ఇందుకు నిదర్శనం. ఈ మ్యాచ్​లో కంగారూ బ్యాటర్లు రెచ్చిపోవడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు అలీసా హేలీ 75(39 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్‌ మూనీ 78*(54 బంతుల్లో 10ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించి భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు.

స్టార్క్, హేలీ
స్టార్క్, హేలీ

భర్త మద్దతు కారణమా..?

ప్రపంచకప్‌ ఫైనల్లో తన భార్య హేలీ ఆటను ప్రత్యక్షంగా చూడాలని ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ భావించాడు. అనుకున్నదే తడవుగా జట్టు యాజమాన్యాన్ని సంప్రదించి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా ప్రపంచకప్‌ వేదికకు వెళ్లాడు. తన అర్ధాంగి కోసం 10 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అలా తుది పోరును ప్రత్యక్షంగా వీక్షించి.. ఆమెకు మద్దతుగా నిలిచాడు. భర్త ప్రోత్సాహమో.. తను పక్కనే ఉన్నాడన్న ఆత్మవిశ్వాసమో ఈ మ్యాచ్​లో హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 39 బంతుల్లోనే 75 పరుగులు చేసి సత్తాచాటింది. ఒక రకంగా భారత్​కు మ్యాచ్​ను దూరం చేసింది తన ఇన్నింగ్సే అని చెప్పవచ్చు. ఎంతో పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల విశ్వాసాన్ని దెబ్బతీయడంలో హేలీ సఫలమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.