ETV Bharat / sports

ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టిన ఆర్​సీబీ కోచ్

ఐపీఎల్​ కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయిన ఆర్​సీబీ కోచ్ మైక్ హెసన్.. ప్రత్యేక విమానంలో తన దేశమైన న్యూజిలాండ్​కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు.

Mike Hesson flies back home to New Zealand after being stranded in India
స్వేదేశానికి వెళ్లిపోయిన మైక్​ హెసెన్​
author img

By

Published : Apr 28, 2020, 5:22 PM IST

ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్​ కమ్ డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న​​ మైక్​ హెసెన్​.. ఎట్టకేలకు న్యూజిలాండ్​ చేరుకున్నాడు. లాక్​డౌన్ వల్ల భారత్​లోనే నెలరోజులకుపైగా చిక్కుకుపోయిన ఇతడు..​ స్వదేశానికి నేడు తిరిగి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

ఐపీఎల్​ 13 సీజన్​లో పాల్గొనేందుకు మార్చి 5న భారత్​కు వచ్చాడు మైక్​. అయితే కరోనా ప్రభావంతో టోర్నీని ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అప్పటికీ వైరస్​ ప్రభావం తగ్గకపోవడం వల్ల నిరవధిక వాయిదా వేశారు. దీంతో ఇక్కడే ఉండిపోయాడు మైక్.

న్యూజిలాండ్​లో తాజాగా లాక్​డౌన్​ ఆంక్షలు సడలించడం వల్ల అక్కడి భారత రాయబార కార్యాలయం సాయంతో స్వదేశానికి చేరుకున్నాడు మైక్​. తాను వెళ్లేందుకు అనుమతించిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, తమ దేశంలోని భారత​ రాయబార కార్యాలయానికి థ్యాంక్స్ చెప్పాడు.

ఇదీ చూడండి : కరోనా తగ్గకపోతే టోక్యో ఒలింపిక్స్ కష్టమే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.