2023 ప్రపంచకప్ నాటికి ప్రస్తుత వైస్ కెప్టెన్ జోస్ బట్లర్.. ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు మాజీ క్రికెటర్ మైకేల్ వాన్. ప్రస్తుతం సారథిగా వ్యవహరిస్తున్న ఇయాన్ మోర్గాన్.. గౌరవనీయులైన ఇంగ్లీష్ క్రికెటర్లలో ఒకడని పేర్కొన్నాడు. 2019 వరల్డ్‌కప్ అందించిన నాటి నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న మోర్గాన్.. వచ్చే వన్డే ప్రపంచకప్ నాటికి అందుబాటులో ఉండేది అనుమానమేనని అభిప్రాయపడ్డాడు.
2021, 2022 టీ20 ప్రపంచకప్‌లకు మోర్గాన్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత్ వేదికగా జరగనున్న 2023 వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం అతడు ఆటగాడిగా ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ మాత్రం బట్లర్‌కు అప్పగించొచ్చు. అని వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
టీమ్ఇండియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోనూ మోర్గాన్ విఫలమయ్యాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతున్న ఇయాన్.. టీ20ల్లోనూ పెద్దగా రాణించలేదు. గాయం కారణంగా రెండో వన్డేకు దూరమైన అతడి స్థానంలో బట్లర్ పగ్గాలు చేపట్టాడు.
ఇదీ చదవండి: స్టోక్స్, బెయిర్ స్టో విధ్వంసం.. ఇంగ్లాండ్‌దే రెండో వన్డే