ETV Bharat / sports

వరుస వన్డే విజయాల్లో ఆసీస్ ప్రపంచ రికార్డు - మెగ్​ లానింగ్

ఆసీస్ మహిళల జట్టు సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. వన్డేల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. తాజాగా కివీస్​తో జరిగిన తొలి వన్డేలో గెలుపొందిన మెగ్​ లానింగ్​ సేన.. వరుసగా 22వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలో ఆసీస్ పురుషుల జట్టు నెలకొల్పిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

Meg Lanning's Australia creates world-record for most consecutive ODI victories'
వరుస వన్డే విజయాల్లో ఆసీస్ ప్రపంచ రికార్డు
author img

By

Published : Apr 4, 2021, 12:05 PM IST

ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో వరుసగా అత్యధిక విజయాలు(22) నమోదు చేసిన జట్టుగా సరికొత్త ఫీట్ సాధించింది. 2003లో రికీ పాంటింగ్​ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు 21 వరుస విజయాల రికార్డును.. తాజాగా మెగ్​ లానింగ్​ నేతృత్వంలోని టీమ్​ అధిగమించింది.

ఇదో గొప్ప విజయం..

తాజా రికార్డుపై ఆసీస్ మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ స్పందించింది. ఇదొక గొప్ప విజయమని సంతోషం వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా జట్టు నిలకడకు ఈ విజయం అద్దం పడుతుందని పేర్కొంది.

"సుదీర్ఘ కాలంలో ఇదొక గొప్ప విజయం. దీన్ని బట్టి మేమేంత స్థిరమైన క్రికెట్ ఆడామో తెలుస్తోంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు బలమైన జట్టు కనిపిస్తోంది. టీమ్​లో అందరూ కీ ప్లేయర్స్​గా ఉన్నారు. జట్టు సమతూకంగా కనిపిస్తోంది. మేము దూకుడైన క్రికెట్​ ఆడటానికి ఇష్టపడతాము."

-మెగ్ లానింగ్, ఆసీస్ మహిళా జట్టు కెప్టెన్.

మౌంట్​ మాంగనుయ్​ వేదికగా కివీస్​ మహిళలతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు 48.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పర్యటక జట్టుకు శుభారంభమేమీ దక్కలేదు. 37 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. హీలి, పెర్రీ, గార్డెనర్​ అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో ఆ జట్టు 38.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి: ఐపీఎల్: ఆర్సీబీ ఓపెనర్ పడిక్కల్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.