ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: లబుషేన్ - లబుషేన్ ఐపీఎల్​

ఐపీఎల్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పిన ఆసీస్ క్రికెటర్ లబుషేన్.. గత ఏడాదిన్నార కాలంలో తన ఆటలో బాగా మార్పు వచ్చిందని చెప్పాడు. రాబోయే వేలంలో ఇతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశముంది.

Marnus Labuschagne
లబుషేన్​
author img

By

Published : Dec 19, 2020, 8:26 PM IST

ఐపీఎల్​లో ఆడటం తనకెంతో ఇష్టమని ఆస్ట్రేలియా యువ బ్యాట్స్​మన్​ మార్నస్​ లబుషేన్ చెప్పాడు​. ఈ మెగాలీగ్​లో పాల్గొనేందుకు చాలా కాలంగా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.

"ఐపీఎల్​లో ఆడేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ లీగ్​లో ఆడే అవకాశం వచ్చినప్పుడు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. గతేడాది నుంచి నా కెరీర్​ చాలా అభివృద్ధి చెందింది. నా ఆటతీరులో మార్పు వచ్చింది. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది"

-లబుషేన్​, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

గత ఏడాదిన్నార కాలంలో టెస్టు క్రికెట్​లో అద్భుత ప్రదర్శనలు చేసి అందరీ దృష్టినీ ఆకర్షించాడు లబుషేన్. 15 టెస్టుల్లో 60.48 స్ట్రైక్​రేట్​తో 1,512 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్​లో అతడిని సొంతం చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి.

అడిలైడ్​లో జరిగిన తొలి టెస్టులో టీమ్​ఇండియాపై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్​లోనూ మంచి ప్రదర్శన చేశాడు లబుషేన్​.

ఇదీ చూడండి : తొలి టెస్టులో భారత్​పై ఆస్ట్రేలియా ఘనవిజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.