ETV Bharat / sports

ర్యాంకింగ్స్​లో మంధానా దూకుడు - భారత మహిళా క్రికెటర్

టీమిండియా డాషింగ్ ఓపెనర్​ స్మృతి మంధానా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో మూడో స్థానం సంపాదించింది. మూడు స్థానాలు మెరుగుపడి కెరీర్​ అత్యుత్తమ ర్యాంక్​కు చేరింది. ఇటీవల వన్డేల్లో తొలిస్థానం సాధించి ఔరా అనిపించుకుంది.

పొట్టి ఫార్మాట్​లోనూ ​మంధానా అదుర్స్
author img

By

Published : Mar 10, 2019, 7:54 PM IST

అద్భుతమైన ప్రదర్శనతో భారత మహిళా క్రికెటర్​ మంధానా టీ20ల్లో మెరుగైన ర్యాంక్​ సాధించింది. తాజాగా ఇంగ్లండ్​తో జరిగిన​ సిరీస్​లో హర్మన్​ ప్రీత్ గాయంతో దూరమవగా కెప్టెన్​గా బరిలోకి దిగిన ఈ టాప్​ బ్యాట్స్​ఉమెన్​.. మూడు మ్యాచ్​ల్లో 72 పరుగులు చేసింది. అందులో ఒక అర్ధశతకం ఉంది.

  • బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో స్మృతి మంధానా మూడో స్థానంలో ఉండగా...తొలి రెండు స్థానాల్లో సుజీ బేట్స్(న్యూజిలాండ్​), డియాండ్రా (వెస్టిండీస్​​) ఉన్నారు.​ టీ20 కెప్టెన్​ హర్మన్​ప్రీత్​​ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

బౌలింగ్​:

రాదా యాదన్​ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరింది. జాబితాలో ఆఫ్​ స్పిన్నర్​ అనుజా పాటిల్​ 31, ఏక్తా బిస్త్ 56వ స్థానంలో నిలిచారు. టీ20 బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో తొలిస్థానంలో మెగన్​ (ఆస్టేలియా) ఉండగా.. టీమిండియా బౌలర్​ పూనమ్​ యాదవ్​ రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఏ దేశం టాప్​:

ఐసీసీ టీ20 జట్ల ర్యాంకింగ్స్​లో ఇంగ్లండ్ రెండో స్థానం కైవసం చేసుకుంది. న్యూజిలాండ్​ను వెనక్కి నెట్టి 277 పాయింట్లతో ఈ స్థానం సంపాదించింది. ఆస్ట్రేలియా 283 పాయింట్లతో మొదటి స్థానంలో, భారత్​ 122 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.