2010లో జరిగిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల వివాహం ఇరుదేశాల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు వీరి బంధానికి ఎప్పుడూ అడ్డురాలేదు. తాజాగా, సానియాతో తన వివాహం గురించి స్పందించాడు షోయబ్. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు తాను ఏమాత్రం భయపడలేదని తెలిపాడు.
"వివాహ సమయంలో మీ భాగస్వామి ఎక్కడ నుంచి వచ్చారు? లేదా ఇరు దేశాల్లో ఏం జరుగుతుందనే అనవసర విషయాల గురించి ఆందోళన చెందరు. మీరు ఒకరిని ప్రేమించి.. ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. నాకు భారత్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధం విషయంలో నేను ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. ఒక క్రికెటర్ని."
-షోయబ్ మాలిక్, పాక్ క్రికెటర్
ఇండో-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లపై స్పందించాడు మాలిక్. ప్రపంచ క్రికెట్‌కు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్‌ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ ఎంత ముఖ్యమో.. భారత్- పాక్ దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా అంతే ముఖ్యమని తెలిపాడు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. అందులో తానూ ఒకడినని చెప్పాడు. త్వరలోనే ఇరుదేశాల మధ్య సిరీస్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.
2015లో మాలిక్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పాడు. అయితే, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు
ఇదీ చూడండి:సానియాను కలిసేందుకు షోయబ్‌కు అనుమతి