బలమైన ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచి, న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది టీమిండియా. అయితే వారిపై తొలి మ్యాచ్‌లోని మొదటి బంతి నుంచే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
![india captain virat kohli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5774500_ind-vs-nz-2.jpg)
"గతేడాది కివీస్ పర్యటనతో చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాం. వారి సొంతగడ్డపై వారినే ఒత్తిడిలోకి తోసి, క్రికెట్ ఆడితే ఆ మజానే వేరు. దానితో పాటే తొలి బంతి నుంచే ఆధిపత్యం చూపించాలనుకుంటున్నాం" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
ఈ పర్యటనలో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరగనున్నాయి. ఈరోజు(సోమవారం) రాత్రే ఆ దేశానికి ప్రయాణం కానుంది కోహ్లీసేన.
![kohli-williamson](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5774500_ind-vs-nz-1.png)