కరోనా ప్రభావంతో ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ఇంటివద్దే సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఐపీఎల్‌పైనా స్పందించాడు. అలాగే ప్రస్తుత పరిస్థితులపైనా మాట్లాడాడు.
"మనం ప్రస్తుతం దేశం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడున్న పరిస్థితులు చక్కదిద్దుకున్నాక ఐపీఎల్ గురించి మాట్లాడదాం. మన లైఫ్ నార్మల్ కానివ్వండి. ఇంతకుముందెప్పుడు ముంబయిని ఇలా చూడలేదు. క్రికెటర్లుగా మాకెప్పుడూ కుటుంబంతో గడిపే సమయం రాదు. ఎప్పుడూ పర్యటనలతో బిజీగా ఉంటాం. కానీ ఇప్పుడు వారితో సమయాన్ని పంచుకునే అవకాశం వచ్చింది."
-రోహిత్ శర్మ, టీమిండియా ఓపెనర్
ప్రస్తుతం పరిమిత ఓవర్లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో జరగాల్సిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో హిట్‌మ్యాన్‌కు విశ్రాంతి ఇచ్చారు సెలక్టర్లు. కానీ ఆ సిరీస్ కరోనా కారణంగా రద్దయింది.