మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ ఆసక్తికర ఫీట్ నమోదు చేశాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్ చేర్చి, వావ్ అనిపించుకున్నాడు. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-2లోనే కాకుండా టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యాట్స్‌మన్‌ను, ఈ బౌలర్ ఇన్నిసార్లు ఔట్ చేయడం చర్చనీయాశంగా మారింది. వాగ్నర్ టెస్టు బౌలర్ల ర్యాంక్‌లో మూడో స్థానంలో ఉన్నాడు.
-
Four in four!
— cricket.com.au (@cricketcomau) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Neil Wagner has the Aussie batsman's measure! #AUSvNZ pic.twitter.com/zHIbu44pvq
">Four in four!
— cricket.com.au (@cricketcomau) December 28, 2019
Neil Wagner has the Aussie batsman's measure! #AUSvNZ pic.twitter.com/zHIbu44pvqFour in four!
— cricket.com.au (@cricketcomau) December 28, 2019
Neil Wagner has the Aussie batsman's measure! #AUSvNZ pic.twitter.com/zHIbu44pvq
ఖాతాలో 200 వికెట్లు
ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను ఔట్ చేసిన నీల్ వాగ్నర్... న్యూజిలాండ్ తరఫున అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో 200 పైగా వికెట్లు తీసిన కివీస్ బౌలర్లలో 7వ వాడిగా నిలిచాడు. గతంలో రిచర్డ్ హ్యాడ్లీ, క్రిస్ కెయిన్స్, డేనియల్ వెటోరీ, క్రిస్ మార్టిన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ ఈ ఘనత సాధించారు.
అంతేకాకుండా ఈ ఫీట్‌ను వేగంగా అందుకున్న రెండో కివీస్ బౌలర్‌గా, ప్రపంచ వ్యాప్తంగా 20వ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 46 టెస్టుల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు నీల్. గతంలో హ్యాడ్లీ 44 టెస్టుల్లో ఈ రికార్డు సాధించి, న్యూజిలాండ్ నుంచి అగ్రస్థానంలో ఉన్నాడు.
జడేజా తర్వాతే
33 ఏళ్ల వాగ్నర్.. ఎడమ చేతి వాటం బౌలర్లలో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా(44 ఇన్నింగ్స్‌ల్లో) తొలిస్థానంలో ఉన్నాడు.
బాక్సింగ్‌డే టెస్టులో భాగంగా మూడో రోజు ఆటముగిసే సమయానికి 456 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది కంగారూ జట్టు. ఫలితంగా ఈ టెస్టులోనూ గెలిచేందుకు అవకాశాలు మెరుగుపర్చుకుంటోంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు నెగ్గింది ఆసీస్.